పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలు యధాతథం

న్యూఢిల్లీ: కార్డు లావాదేవీలపై బ్యాంకులు ఒక శాతం పన్ను విధించనున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకు యాజమాన్యాలు తాము ఇకపై కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించబోమని ప్రకటించాయి. దీంతో గత రెండు రోజులుగా వాహనదారులు అయోమయంలో పడిపోయారు. అసలే నోట్లరద్దుతో సతమతమవుతున్న వేళ ఇదేంటని కంగారుపడ్డారు.

కానీ కేంద్రం పన్ను విషయంలో వెనక్కి తగ్గడంతోపాటు పెట్రోల్ బంకుల వద్ద కార్డుతో జరిగే లావాదేవీలపై ఎలాంటి పన్ను ఉండదని సోమవారం స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులకు అదనపు పన్ను ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

అలాగే రిటేల్ పెట్రోల్ కంపెనీలపై కూడా ఎటువంటి పన్ను భారం ఉండదని వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో డిసెంబర్ 30 వరకు పెట్రోల్ బంకులు నగదు రహిత లావాదేవీలపై పన్ను వసూలు చేయకపోవడం తెలిసిందే. కాగా, ప్రస్తుతం నోట్ల రద్దు కాలపరిమితి ముగిసిపోవడంతో పెట్రోల్ బంకు యాజమాన్యాలు మళ్లీ ట్యాక్స్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి.

Related Posts

About The Author

Add Comment