పాము రాకతో విమానం రద్దు

మస్కట్: ఇంకొన్ని నిమిషాల్లో బయలుదేరాల్సిన విమానాన్ని ఓ పాము ఆపుచేసింది. ప్రయాణికులు విమానం ఎక్కుతున్న సమయంలో కార్గో లోపల పాము దర్శనమిచ్చింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపేశారు. అనంతరం విమానం నుంచి పామును తొలగించారు. అయితే కాసేపు ఏర్పడిన గందరగోళం కారణంగా ఏకంగా విమానాన్ని రద్దు చేశారు.

ఎమిరేట్స్‌కి చెందిన ఇకె0863 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మస్కట్ నుంచి దుబాయికి విమానం వెళ్లాల్సి ఉంది. కానీ ఈ ఘటన నేపథ్యంలో సర్వీస్ రద్దు చేస్తున్నట్లు సంస్థ అధికారులు ప్రకటించారు. అచ్చం ఇలాగే గతేడాది నవంబర్‌లో ఏరోమెక్సికో విమానంలో సైతం పైనున్న లగేజీ కంపార్ట్‌మెట్‌లో ఆకుపచ్చ పాము వేలాడుతూ కన్పించిన సంగతి తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment