రేపటి నుంచి పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలు బంద్

నోట్లరద్దుతో సతమతమవుతున్న ప్రజలకు  పెట్రోల్ బంకులు మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్నా పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయని సమాచారం. దీనికి కారణం కార్డుల ద్వారా జరిపే ప్రతి లావాదేవీలపై బ్యాంకులు ఒక శాతం చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడమే అని తెలుస్తోంది.

ఇది బ్యాంకులు తీసుకున్న అక్రమ నిర్ణయమని పెట్రోల్ బంకు యాజమాన్యాలు భగ్గుమంటున్నాయి. దీంతో పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్నా పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించకూడదని నిర్ణయించింది. నగదురూపంలోనే వాహనాదారులు చెల్లింపులు చేయాలని బంకు యజమానులు కోరుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం… కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే 0.75 శాతం క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ ను ప్రకటించడంతో జనాలు నగదురహిత లావాదేవీల వైపు మొగ్గుచూపారు. కానీ పెట్రోబంకు యాజమాన్యాల ఈ నిర్ణయంతో వాహనదారులకు కష్టాలు తప్పకపోవచ్చు.

Related Posts

About The Author

Add Comment