వొడాఫోన్ ‘సూపర్ అవర్’ ఆఫర్‌

జియో ప్రభంజనాన్ని తట్టుకుని.. తమ వినియోగదారులను నిలుపుకోవడానికి ఇతర నెట్‌వర్క్‌లు వివిధ ఆఫర్‌లను ప్రకటిస్తుస్న విషయం విదితమే. ఇప్పటికే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్ తాజాగా మరో సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. ‘సూపర్ అవర్’ పేరుతో ఓ ప్లాన్‌ను తమ ప్రిపెయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులో తెస్తోంది. దీనిలో భాగంగా రూ. 16, రూ. 7, రూ. 5 ప్యాక్‌లను అందుబాటులో ఉంచింది.

రూ. 16 పెట్టి రిచార్జీ చేసుకుంటే ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ 3జి/4జి డేటా వాడుకోవచ్చట. ఆ గంటలోపు హైస్పీడ్‌తో ఎంతైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేగాక ఒక రోజులో ఎన్నిసార్లయిన రిచార్జీ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రూ. 5తో రిచార్జీ చేసుకుంటే ఒక గంటపాటు అన్‌లిమిటెడ్ 2జి డేటా పొందవచ్చు. ఇక రూ. 7తో రిచార్జీతో ఒక గంట పాటు వొడాఫోన్ టూ వొడాఫోన్ అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లను శనివారం అధికారికంగా లాంఛ్ చేయనున్నట్లు వొడాఫోన్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

కాగా, ఈ నెల 9 నుంచి ఈ ప్లాన్స్ మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, బిహార్-జార్ఖండ్, పంజాబ్-హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్-చత్తీగఢ్, జమ్మూ కాశ్మీర్ సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండదని వొడాఫోన్ సంస్థ వెల్లడించింది. అంతేగాక సర్కిల్స్‌ను బట్టి ప్లాన్ రేటు కూడా మారుతుందని వొడాఫోన్ చీఫ్ కమర్షియల్ అధికారి సందీప్ కటారియా తెలిపారు. ఈ వన్ అవర్ ప్లాన్ ఇక ఎవ్రీ అవర్ సూపర్ అవర్ అవుతుందని ఆయన అన్నారు.

Related Posts

About The Author

Add Comment