ల్యాప్‌టాప్‌ సేవ్స్ లైఫ్…!

ఫ్లోరిడా: నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా, మరో 13 మంది గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాశ్రయంలోని ప్రయాణికులు ఒక్కసారిగా పరుగు తీశారు. అందరీతోపాటు స్టీవ్ అనే వ్యక్తి కూడా కాల్పులు జరుగుతున్న ప్రాంతం నుంచి బయట పడేందుకు యత్నించాడు.

ఈ క్రమంలో ఆగంతకుడు కాల్చిన బుల్లెట్ ఒకటి స్టీవ్ వీపుపై ఉన్న బ్యాగ్‌కు తగిలింది. కానీ స్టీవ్ అదేమీ పట్టించుకోకుండా వెళ్లి వాష్‌రూమ్‌లో దాక్కున్నాడు. ఆ తర్వాత తన బ్యాగు తీసి చూడగా… బ్యాగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌కు బుల్లెట్ తగిలిన గుర్తు కనిపించింది. దాంతో అతడు వెంటనే ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ల్యాప్‌టాప్ తన పాలిట ప్రాణదాతగా మారిందని ఊపిరి పీల్చుకున్నాడు.

Related Posts

About The Author

Add Comment