సిఎంగా పోటీ చేసేందుకు.. ఎంఎల్‌ఎగా రాజీనామా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎ జర్నైల్ సింగ్ తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు.  కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు వ్యతిరేకంగా ఆప్ నుంచి జర్నైల్ సిఎం అభ్యర్థిగా పోటీలో ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతకొద్ది నెలలుగా జర్నైల్ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

అంతేగాక పంజాబ్‌లో బాదల్ ప్రభుత్వాన్ని ఓడించి ఆప్‌ను గెలిపించేలా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహారచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే జర్నైల్ రాజీనామా తతాంగం జరిగినట్లు సమాచారం. 2015 ఫిబ్రవరిలో జరిగిని ఢిల్లీ ఎన్నికల్లో రాజౌరి గార్డెన్ నుంచి జర్నైల్ ఎంఎల్‌ఎగా గెలుపొందిన విషయం తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment