పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని పొగడ్తలు వచ్చాయో అన్నీ విమర్శలు కూడా వచ్చాయి. ప్రతిపక్షాలైతే మోడీ నిర్ణయం ఏమాత్రం మింగుడుపడడం లేదు. అయితే తాజాగా మోడీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు అందించబోతుందని సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం(పిఎంజికెవై) ద్వారా వచ్చిన నగదుపై రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. పిఎంజికెవై ద్వారా వసూలైన సొమ్ములో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలనే యోచనతో నేరుగా పేదల ఖాతాల్లో రూ. 1000 వరకు జమ చేయనున్నారని తెలుస్తోంది. ఇలా జరిగితే నోట్లరద్దుపై వచ్చిన వ్యతిరేకతపై ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించడం ఖాయం. డిసెంబర్ 17న ప్రకటించిన పిఎంజికెవై పథకం మార్చి 31 వరకు అమలులో ఉండనుంది. దీని ద్వారా పన్ను ఎగవేతదారులు స్వతహాగా తమ ఆదాయం వివరాలను వెల్లడించడం వల్ల శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

Related Posts

About The Author

Add Comment