ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సందేహం వద్దు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధులు విద్యార్థులను రెచ్చగొట్టె విధంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1880 కోట్లని తెలిపారు.

కాంగ్రెస్ పాలనకాలంలో ప్రతీ ఏడాది రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రీయింబర్స్‌మెంట్ కొరకు ప్రతి ఏటా రూ. 2వేల నుంచి రూ. 2వేల 5వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. ఈ ఏడాది 1487 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రీయింబర్స్‌మెంట్ పెంచుతున్నట్లు ప్రకటించారు.

ప్రమాణాలు పాటించని కళశాలలపై కోరడా ఝలిపించడంతోపాటు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించడం ఖాయమన్నారు. ఈ విషయంలో విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Related Posts

About The Author

Add Comment