విశ్వాసం మరిచింది… యజమాని కుటుంబాన్ని రక్కేసింది..!!

వాషింగ్టన్: పెంపుడు కుక్క తమ యజమానిపై దాడి చేయడం అనేది చాలా అరదుగా జరుగుతుంది. ఎందుకంటే తనకు అన్నం పెట్టిన యజమానిపై అంతటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది శునకం. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ శునకం తన యజమాని కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపించింది. ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. ఎంతలా అంటే ఇంటిని వదిలి కుటుంబంమంతా రోడ్డుపై పడేంతలా.

వివరాల్లోకి వెళితే… ఫ్లోరిడాలో ఉండే బ్రెండా గుర్రీరో అనే తన పెంపుడు శునకానికి స్వెటర్ తొడగాలని ప్రయత్నించింది. అయితే స్వెటర్ తొడిగే సమయంలో ఆ శునకం ఉన్నటుండి విపరితమైన కోపంతో ఉగిపోయిందట. ఇంకేంముంది… మొదట గుర్రీపై దాడి చేసింది. దాంతో ఆమె గట్టిగా అరవడంతో భర్త ఇస్మాయిల్ శునకాన్ని అదుపుచేయడానికి యత్నించాడు. అంతే ఆయనపై కూడా విరుచుకుపడింది.

ఈ క్రమంలో వారి కుమారుడు అక్కడి వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు యత్నించగా అతడిపై కూడా దాడి చేసి గాయపరిచింది. దాంతో ఆ ముగ్గురు బతుకు జీవుడా అంటూ ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇది గమనించిన చుట్టూ పక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకొని శునకాన్ని డాగ్స్ వ్యానులో అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా శునకం ఇంతా రెచ్చిపోవడానికి గల కారణం ఏమిటనేది మాత్రం స్పష్టంగా తెలియదని పోలీసులు అన్నారు. ఇంతటి సీన్ క్రియేట్ చేసిన శునకం పేరు స్కార్ ఫేస్.

Related Posts

About The Author

Add Comment