డాక్టర్లపై బిజెపి ఎంపి దాడి

బెంగళూరు : తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కర్ణాటక బిజెపి ఎంపి అనంత్ కుమార్ హెగ్డె మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులపై ఆయన దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. ఇందుకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ బయటకు రావడంతో ఎంపి నిర్వాకరం బయటపడింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఎంపి కార్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ.. మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ అనే ముగ్గురు వైద్యులపై అనంత దాడి చేశాడు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన సిసిటివిలో రికార్డైంది. అయితే ఇంతవరకు పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

Related Posts

About The Author

Add Comment