పిపిఎకు ఎదురుదెబ్బ

ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార పార్టీ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పిపిఎ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా పిపిఎకు చెందిన 33 మంది ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరారు. దీంతో ప్రస్తుతం పిపిఎలో కేవలం 10 మంది ఎంఎల్‌ఎలు మాత్రమే మిగిలిపోయారు.

గత కొంతకాలంగా పిపిఎలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం క్రమశిక్షణ ఉల్లంఘించారనే నేపంతో సిఎం పెమాఖండూ సహా మరో ఆరుగురు ఎంఎల్‌ఎలను పార్టీ నుంచి బహిష్కరించారు.

పిపిఎ నిర్ణయంతో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం తరువాత బిజెపి పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా రెండో రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.

Related Posts

About The Author

Add Comment