జియో గురించి అది తప్పడు సమాచారం

మొదట ప్రమోషనల్ ఆఫర్ పేరిట 90 రోజులపాటు ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా అన్నీ ఉచితంగా అందించింది జియో. అనంతరం ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లు ఇది ట్రాయ్ నింబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించాయి. దీంతో జియో ఆఫర్లపై ముఖేష్ అంబానీ వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలు ఉల్లఘించలేదని స్పష్టం చేశారు.

అలాగే ప్రారంభ ఆఫర్, తాజా న్యూ ఇయర్ ఆఫర్ రెండు వేర్వేరు అని ట్రాయ్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను దోపిడీగా పేర్కొనడం సరికాదని ట్రాయ్‌కు వివరించారు.

దీంతో ట్రాయ్ అధికారులు అంబానీ వివరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కావున  జియో ఆఫర్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దాంతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31 వరకు యధావిదిగా కొనసాగనుంది.

Related Posts

About The Author

Add Comment