‘రింగింగ్ బెల్స్’..మూతపడినట్లే..?

కేవలం రూ.251కే అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ అప్పట్లో రింగింగ్ బెల్స్ అనే సంస్థ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రకటనతో ఈ ఫ్రీడం మొబైల్‌ని దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారందరికి ఇది షాకింగ్ న్యూస్. ‘రింగింగ్ బెల్స్’ సంస్థ దాదాపు మూతపడిపోందనే వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. దాదాపు రెండు వారాలుగా కంపెనీ కార్యాలయాన్ని తెరవకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. కంపెనీ ఎండి మోహిత్ గోయల్, ఆయన సతీమణి ధర్నగోయల్ ఇరువురు కంపెనీ నుంచి వైదొలిగారట.. దీంతో కంపెనీ కథ కంచికి చేరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మోహిత్ గోయల్, ధర్నగోయల్ కలిసి ఎండిఎం ఎలక్ట్రానిక్స్ అనే మరో కంపెనీ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

Related Posts

About The Author

Add Comment