రద్దు కానున్న ఆ కొత్త నోటు…!?

హైదరాబాద్: కొత్త ఏడాది ప్రారంభంలో ఆర్ బిఐ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అదేమిటంటే కొత్త రూ.2వేల నోట్ల రద్దు. రాజకీయ బడాబాబులు, నల్లకుబేరుల బరతం పట్టేందుకంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇటు సామాన్య ప్రజలను, అటు బడాబాబులనూ కలవరపరచిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకు ఉద్యోగులతో కుమ్మక్కైన కొందరు నల్లకుబేరులు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నట్లు ఆర్ బిఐ ఉన్నతాధికారులు గమనించి ఈ కొత్త నోట్ల రద్దుకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే మరోటి అయ్యిందనీ, అందుకే కొత్త నోట్లను రద్దు చేస్తున్నట్లు సామాజిక మీడియా కోడైకూస్తోంది.

నిజంగా బ్లాక్ మనీని అరికట్టడం, పన్ను వెగవేతదారులు, అక్రమ ఆదాయం కలిగివున్న వారిపై చర్యలు తీసుకోవడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు బడాబాబులు(రాజకీయ నేతలు) కానీ, పారిశ్రామిక వేత్తలు, నల్లకుబేరులు కానీ ఒక్కరూ పట్టుబడలేదు. అలాగే నోట్ల రద్దు జరిగిన సరిగ్గా వారం రోజుల్లో భారతీయ స్టేట్ బ్యాంకులో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన బడా వ్యాపారుల బకాయిలను మొండి బకాయిలుగా సాగు చూపించి రద్దు పరుస్తున్నట్లు ప్రకటించిన విషయం యావత్ భారతీయులు గమనించిన విషయం. అయితే దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురించడంతో ఆర్థిక మంత్రి కాస్త వెనక్కు తగ్గారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదని కేంద్రం చెప్పేసింది.

మొత్తానికి పెద్దనోట్ల రద్దు చేయడం వల్ల లక్షల కోట్లు దోచుకున్న బడా వ్యాపారులు, రాజకీయనేతల్లో కొందరికి ప్రభుత్వ పెద్దలనుండి ముందస్తు సమాచారం అందడంవల్లే వారంతా సర్దుకున్నారని సామాజిక మీడియాల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలొస్తున్నాయి. దీనికి ఉదాహారణ టిటిడి సభ్యుడు, టిడిపి నేత శేఖర్ రెడ్డి వద్ద దొరికిన వందల కిలోల బంగారం, రూ.70కోట్లకుపైగా రూ.2000ల కొత్త నోట్లు అని పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలంటే ప్రత్యర్థులను మట్టు కరిపించేందుకే ఎత్తుగడ జరిగిందని అంటున్నారు. వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో 2వేల నోటును ప్రవేశపెట్టడంతో ప్రజలు నోట్ల మార్పిడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎప్పటికీ కొనసాగినట్లైతే ప్రభుత్వ మనుగడకు విఘాతం కలిగే అవకాశంలేకపోలేదని పలువురు అభిప్రాయం.

నల్లకుబేరులు బ్యాంకు అధికారులతో లాలూచీపడి వారి వద్ద ఉండిన నల్లధనాన్ని రూ.2వేల కొత్ల నోట్ల రూపంలో తెల్లధనంగా మార్చేశారనీ వందలాది మంది వారి అభిప్రాయాలు తెలుపుకున్నారు. దీంతో చివరకు సామాన్యులే ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, సామాన్యులు తమ వద్ద సంపాదించుకుని పెట్టుకున్న కొద్ది డబ్బునుండి ఆర్బిఐ పన్నుల రూపంలో లాగేసిందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు వల్ల వచ్చిన అపవాదును తొలగించుకునే నిమిత్తం వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను రద్దు చేసి మరోసారి నల్లకుబేరుల తలపగలగొట్టే ప్రయత్నం చేస్తోందని సమాచారం. మొదటి దఫా విజయం సాధించలేకపోయిన ప్రభుత్వం రెండో దఫా కొత్త రూ.2వేల నోటును రద్దు చేసి రెండో దఫా విజయవంతంగా బడాబాబులు, నల్లకుబేరుల నడ్డివిరిచేందుకు కృతనిశ్చయంతో ఉందని తెలిసింది. ఏదేమైనప్పటికీ నిన్నమొన్నటివరకూ అందని ద్రాక్షగా ఉన్న రూ.2ల కొత్త నోటు మరికొద్ది రోజుల్లో రద్దు కాబోతోందనడంలో సందేహంలేదు.

Related Posts

About The Author

Add Comment