‘కాటమరాయుడు’ తాజా పోస్టర్ విడుదల

హైదరాబాద్ : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటామరాయుడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేశారు. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘వీరం’ చిత్రం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్ కుమార్ పార్ధసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహసన్ నటిస్తుంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల కానుంది.

Related Posts

About The Author

Add Comment