ప్రగతి భవన్ తెలంగాణ గౌరవం: సిఎం కెసిఆర్

శాసనసభలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రగతి భవన్‌లో 150 గదులున్నాయని వ్యాఖ్యానించడంతో సిఎం కెసిఆర్ కోపోద్రిక్తులయ్యారు. ప్రగతి భవన్‌లో ఉన్నా 150 గదులను చూపించగలరా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ తెలంగాణ గౌరవమని, రాష్ట్ర ఆస్తి అని సిఎం స్పష్టం చేశారు. ప్రగతి భవన్ తెలంగాన ప్రజల ఆస్తి… కానీ కెసిఆర్ ఇల్లు కాదని మండిపడ్డారు.

పత్రికల్లో వచ్చే వార్తలను ఆధారం చేసుకొని అసెంబ్లీలో మాట్లాడడం మానుకోవాలన్నారు. గత పాలకులు రాష్ట్ర ముఖ్యమంత్రికి యోగ్యమైన నివాసం లేకుండా చేశారన్నారు. ఏకంగా సిఎం కాన్యాయ్ రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రగతి భవన్ నిర్మించామని కెసిఆర్ చెప్పారు. దీనిపై కూడా ఇలా రాద్దాంతం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ ధోరణి ఏంటో కోమటిరెడ్డి బయటపెట్టారని సిఎం విమర్శించారు

Related Posts

About The Author

Add Comment