వీడియో వాళ్లను పట్టించింది…

సౌదీలో కొందరు పురుషులు, స్త్రీలు కలిసి మస్తుగా మద్యం సేవించారు. ధూంధాంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను అంతర్జాలంలో పెట్టారు. అది సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. అయితే ఈ వీడియో కాస్తా పోలీసుల కంటపడింది. దాంతో వీడియో వివరాలు సేకరించి పార్టీలో పాల్గొన్న ఇద్దరు పురుషులు, ఇంకొంతమంది స్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ చట్టాల ప్రకారం స్త్రీ, పురుషులు కలిసి మద్యం సేవించడం నేరమట. దీంతో వారు తమ స్వయం అపరాధం వల్ల పోలీసులకు చిక్కినట్లైంది. పార్టీలో రచ్చ చేసిన వాళ్లు కటకటాల్లో రోదిస్తున్నారు.

Related Posts

About The Author

Add Comment