హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో ‘జియో’ 3జి సేవలు!

న్యూఢిల్లీ : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో వినియోగదారులకు మరో సూపర్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికి వరకు కేవలం 4జి ఫోన్లకే పరిమితమైన జియో సేవలను త్వరలో 3జి మొబైల్స్‌కు అందించనుంది. ఈ మేరకు ఓ కొత్త మొబైల్ అప్లికేషన్‌ని సంస్థ రూపొందించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ కింద 3జి కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. తొలుత డిసెంబర్ 31 వరకు ‘వెల్‌కమ్ ఆఫర్’ కింద ఉచిత కాల్స్, అపరిమిత డేటా సౌకర్యం కల్పించిన జియో.. తన ఆఫర్‌ను మార్చి 31 వరకు ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment