నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు

హైదరాబాద్: శాసనసభలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని టేకోవర్ చేయడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని తెలిపారు. రైతులకు జానారెడ్డి నాయకత్వం వహిస్తానంటే అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ పరిధిలో 95 శాతం మంది రైతులు చెరుకు పంట వేయడం లేదని, ఫ్యాక్టరీ తెరిస్తే చెరుకు సమస్య ఏర్పడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ రైతులు సుముఖంగా లేరన్నారు. అలాగే ఫ్యాక్టరీ పూర్తిస్థాయి సామర్థంతో పనిచేయాలంటే పది లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు అవసరమవుతుందని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలను సొసైటీలు నడిపితే నిలకడగా ఉంటాయని తెలిపారు.

దీనికోసం నిజాం షుగర్స్ ఏరియాలోని శాసనసభ్యులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి సొసైటీ వివరాలు అందించి, రైతులను చెరుకు పంట సాగుకు సిద్ధం చేస్తే నిజాం షుగర్స్‌ను ప్రారంభించుకుందామన్నారు. చివరగా దశాబ్దంపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేక పోయిందని విమర్శించారు.

Related Posts

About The Author

Add Comment