టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి అరెస్ట్!

చెన్నై : భారీగా నల్లధనంతో పట్టుబడ్డ టిటిడి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని బుధవారం సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌లను అధికారులు అరెస్ట్ చేసి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. శేఖర్‌రెడ్డికి కోర్టు జనవరి 3వరకు రిమాండ్ విధించింది. ఇటీవల శేఖర్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.127 కోట్ల నగదు, 100కేజీల బంగారం దొరికిన విషయం తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment