ఇకపై ఎటిఎం నుంచి ఎంతైనా విత్ డ్రా చేసుకోవచ్చట…

న్యూఢిల్లీ: నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే త్వరలో కరెన్సీ కష్టాలు కొంతవరకు తీరే సూచనలు కన్పిస్తున్నాయి. డిసెంబర్ 30 తర్వాత ఎటిఎంల నుంచి నగదు విత్‌డ్రాపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్నా రూ. 2500 విత్‌డ్రా పరిమితిని ఎత్తివేయనున్నారు. ఇంతకుముందులా ఎంతైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇదేవిధంగా బ్యాంకుల నుంచి విత్‌డ్రా విషయంలో కూడా ఆంక్షలను తొలగించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. ప్రస్తుతం బ్యాంకుల్లో వారానికి రూ. 24 వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment