వైద్య, ఆరోగ్య శాఖలో 2118 పోస్టుల భర్తీ

హైదరాబాద్ : వైద్య ఆరోగ్యశాఖలో 2118 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో 592 పోస్టులు వైద్యులకు సంబంధినవి కాగా, 941 స్టాఫ్ నర్సు పోస్టులు, 152 ఎఎన్‌ఎం, 213 ఫార్మా సిస్ట్ గ్రేడ్ 2 పోస్టులున్నాయి. ప్రజారోగ్యం, వైద్యవిద్య, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టులు, ఇతర ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలను టిఎస్‌పిఎస్‌సి చేపట్టాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts

About The Author

Add Comment