రష్యా రాయబారి కాల్చివేత

టర్కీ : టర్కీలో రష్యా రాయబారి ఏండ్రీ కార్గోవ్(62)ను ఓ గన్ మ్యాన్ కాల్చి చంపాడు. మెర్ట్ అల్టింటాస్ అనే వ్యక్తి తనర తుపాకీ ఎక్కుపెట్టి అల్లాహో అక్బర్ … తాము అలేప్పీలో మరణిస్తాం…మీరు ఇక్కడే చస్తారూ అంటూ కేకలు పెట్టాడు. ఓ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఘటన జరిగింది. అల్టింటాస్ మరో ముగ్గురిపై కాల్పులు జరిపి గాయపర్చాడు. వెంటనే తేరుకున్న పోలీసులు అల్టింటాస్‌ను కాల్చి చంపారు. తమ దేశ రాయబారి దారుణ హత్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. రష్యా, టర్కీ దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు జరిగిన కుట్రగా ఆయన ఈ ఘటనను అభివర్ణించారు. టర్కీ రాజధని అంకారాలో పోలీసు రయట్ స్కాడ్‌లోని సభ్యునిగా దుండగుడిని గుర్తించారు. అల్లర్లను రెచ్చగొట్టేవారిని అరెస్టు చేసేందుకు ఉద్దేశించిన పోలీసుదళంలోనే ఇతగాడు ఉండడం గమనార్హం.

Related Posts

About The Author

Add Comment