స్టెఫానీ డెల్ వాలీకి ప్రపంచ సుందరి టైటిల్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో గల ఎంసిఎం నేషన్‌ల హార్బర్‌లో జరిగిన 66వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్యూర్టో రికోకు చెందిన స్టెఫానీ డెల్ వాలీ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో 100 మందికి పైగా ప్రపంచ సుందరిమణులు పోటీ పడ్డారు.

భారత్‌కు చెందిన ప్రియదర్శిని ఛటర్జీ టాప్ 20లోనే ఆగిపోయింది. కాగా ప్యూర్టోరికో దేశానికి ప్రపంచ సుందరి టైటిల్ దక్కడం ఇది రెండోసారి. విజేత స్టెఫానీనికి మాజీ మిస్ వరల్డ్ మారియా లాలాగుణా కిరీటాన్ని బహుకరించారు.

Related Posts

About The Author

Add Comment