రజనీకాంత్..తన స్నేహితులను ఎలా కలుసుకుంటారో తెలుసా..?

రజనీ ఓ మార్గదర్శి.. ఎదిగినకొద్దీ ఒదిగుండాలనే మాదటను అచరణాత్మకంగా చేసి చూపించే వ్యక్తి మన మధ్యలో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్ అనే చెప్పాలి.. రజనీకాంత్ ఓ పెద్ద హీరో. ఆయన్ని ఇష్టపడని వారు బహుషా దేశంలోనే లేరేమో. కనీసం ఆ మహానటుడితో కలిసి ఒక్క ఫొటోనైనా తీసుకోవాలని అనుకుంటుంటారు వీరాభిమానులు. అలాంటి గొప్ప నటుడు తన పాత, పేద స్నేహితులను మరచిపోలేదంటే నమ్ముతారా? అంతేకాదు అడపాదడపా మారువేషంలో వెళ్లి తన స్నేహితులను కలుసుకుంటారట. అది రజనీ కాంత్ స్టైల్ మరి. ఎదిగిన కొద్ది ఒదిగివుండటమంటే అదే.

రజనీ కాంత్ సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు బెంగళూర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్(బిటిఎస్) బస్సుల్లో కండక్టర్ గా పనిచేశారు. అదే బస్సులో బెంగళూర్ చామరాజ్ పేటకు చెందిన రాజ్ బహదూర్ డ్రైవర్ గా పనిచేసేవారు. అప్పుడు వీరిద్దరూ మాంచి జిగిరీ దోస్తులు. సరదాగా తిరిగేవారట. అప్పుడప్పుడు ఆటవిడుపుగా కలిసి చిన్నచిన్న పార్టీలు కూడా చేసుకునేవారట. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటున్నారు బహదూర్. తన స్నేహితుడు తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికీ తన స్నేహితులను మరచిపోలేదని బహదూర్ అంటారు.
బహదూర్ బెంగళూరు నగరానికి సమీపంలోని చామరాజ్ పేటలో ఓ సింగిల్ రూం ఇంట్లో నివాసముంటున్నాడు.

రజనీ బయటకు వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవగా ఉండటంతో, భద్రతా ఇబ్బందుల దృష్ట్య తన ఇంటికి ప్లంబర్ గానో, యాచకుని వేశంలోనో వచ్ే వాడని రాజ్ బహదూర్ చెప్పుకొచ్చారు. ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నప్పటికీ తన స్నేహితుడు రజనీకాంత్ మాత్రం ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారట. కలిసినప్పుడెల్లా పాత రోజులు నెమరవేసుకుంటూంటారట. తోటి ఉద్యోగుల స్థితిగతులను గురించి ఊసులు పంచుకుంటారట.

Related Posts

About The Author

Add Comment