యెమెన్‌ ఆత్మాహుతి దాడిలో 43 మంది సైనికులు మృతి

సనా: యెమెన్‌లోని ఎడెన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో 43 మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో సైనికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.

అల్ సోల్బాన్ ఆర్మీ స్థావరం వద్ద ఆదివారం సైనికులు తమ జీతాలు తీసుకునేందుకు క్యూలో నిలబడిన సమయంలో ఈ దాడి జరిగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన సూసైడ్ బాంబర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Related Posts

About The Author

Add Comment