మాట్లాడుతుండగా పేలిన మొబైల్.. సింగర్‌కు తీవ్ర గాయాలు

హాలీవుడ్ పాప్ సింగర్ సీలో గ్రీన్‌కు ఊహించని ఘటన ఎదురైంది. తాను మొబైల్‌లో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి అది పేలిపోయింది. దాంతో గ్రీన్ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు గ్రీన్ మ్యూజిక్ రికార్డింగ్ గదిలో ఉన్న సిసికెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో గ్రీన్ తాను బాగానే ఉన్నట్లు మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Related Posts

About The Author

Add Comment