పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయొద్దు: పవన్

హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఐదు అంశాలపై అధికార పార్టీ బిజెపిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ దేశభక్తి అంశంపై ప్రశ్నలు వేశారు. పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయొద్దంటూ ట్వీట్ చేశారు. ఆయా పార్టీల సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించరని ప్రశ్నించారు.

కాలక్షేపానికి వచ్చే సినిమా థియేటర్లలో దేశభక్తిని పరిక్షీంచడం ఎంతవరకు సబబు అని అడిగారు. సినిమాహాళ్లు దేశభక్తికి పరీక్షా వేదికలు కాకూడదని చెప్పారు. విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి లేనట్టు కాదని విమర్శించారు. చివరగా ఎపికి ప్రత్యేక హోదా అంశంపై శనివారం ట్వీట్ చేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

Related Posts

About The Author

Add Comment