ఐటి శాఖ సంచలన నిర్ణయం… 3వేల మందికి నోటీసులు

న్యూఢిల్లీ: నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఐటి శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 3వేల మంది బ్యాంకు ఖాతాదారులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా 316 కోట్ల(వీటిలో 80 కోట్ల వరకు కొత్త కరెన్సీ) నగదుతోపాటు రూ. 76 కోట్లు విలువ చేసే ఆభరణాలను ఐటి శాఖ సీజ్ చేసింది.

కాగా, ఐటి సోదాల్లో పట్టుబడిన నగదుకు బ్యాంకు వివరాలు సరితుగకపోవడంతో ఐటి శాఖ నోటీసులు జారీకి రెడీ అవుతుంది. దీనిలో భాగంగా ప్రతీపైసాకు లెక్క చెప్పాలని ఆదేశించింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది.

నోట్ల రద్దు తర్వాత కొందరు బ్యాంకుల ద్వారా బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు ప్రయత్నించినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదుతోపాటు, జ్యూయలరీని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

Related Posts

About The Author

Add Comment