ట్యూషన్ మాస్టర్ల కీచక పర్వం.. 30 మంది విద్యార్థినులపై లైంగిక దాడి

చెన్నై: ముగ్గురు మాస్టర్లు తమ వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థినులలో 30 మందికి మత్తుమందిచ్చి కామకోరిక తీర్చుకున్న అతిదారుణ ఘటన నగరంలోని పాలక్కాడులో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం… తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కాడుకు చెందిన శివకుమార్ తన మిత్రులైన ఈశ్వరన్, శివలతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఈ ముగ్గురు మిత్రులు గత నాలుగేళ్లుగా పాలక్కాడు, ధర్మపురిలలో రెండు ట్యూషన్ సెంటర్లు నడిపిస్తున్నారు. ఈ సెంటర్లలో పదోతరగతి, ఇంటర్‌కు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులు ట్యూషన్‌కు వస్తారు. అయితే శివకుమార్ ట్యూషన్‌కు వచ్చే విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరిట ఎక్కువసేపు సెంటర్‌లోనే ఉంచేవాడు. ఆ సమయంలో అదునుచూసి శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు.

అది తాగి స్పృహకోల్పోయిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. అనంతరం వాటిని చూపించి వారితో తన కామవాంఛను తీర్చుకునేవాడు. ఆ సమయంలో ఆ దృశ్యాలను సైతం వీడియో తీసి భద్రపరిచేవాడు. ఆ తరువాత ఇదేవిధంగా అతడి మిత్రులు కూడా ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి అమ్మాయిలను లొంగదీసుకునేవారు. ఇలా గత 2 ఏళ్ల కాలంలో వీరు ముగ్గురు 30 మంది విద్యార్థినుల జీవితాలను నాశనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts

About The Author

Add Comment