బిలియన్ యాహూ అకౌంట్లు హ్యాక్..!!

న్యూయార్క్: గతంలో పెద్ద మొత్తంలో తమ ఖాతాలు హ్యాక్ అయినట్లు తెలిపిన ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తాజాగా ఖాతాదారులకు మరోసారి షాక్‌కు గురిచేసింది. దాదాపు 100 కోట్లకు(బిలియన్)పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు వెల్లడించింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడిని సైబర్ చరిత్రలోని అతిపెద్ద దాడిగా పేర్కొంది.

ఈ దాడిలో వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం తస్కరించబడినట్లు ప్రకటించింది. కావున తమ ఖాతాదారులకు తమ పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ప్రశ్నల జవాబులను మార్చుకోవాలని సంస్థ కోరింది.

ఇంతకు ముందు 2014లో 50 కోట్ల యూజర్ల వివరాలు హ్యాక్ అయినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద సైబర్ దాడిగా ఉంది. కానీ తాజాగా జరిగిన 100 కోట్ల ఖాతాల హ్యాకింగ్ ప్రస్తుతం కలకలంగా మారింది. ఈ ఘటనతో యాహూ మరోసారి చిక్కుల్లో పడినట్లైంది.

Related Posts

About The Author

Add Comment