బిజెపిపై జనసేనాని ట్వీట్లు

హైదరాబాద్: సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు వపన్ కల్యాణ్ మరోసారి బిజెపిపై విమర్శనాస్త్రాలు సందించారు. గురువారం పవన్ ట్విట్టర్ ద్వారా బిజెపి ముందు ఐదు అంశాలను ఉంచారు. వీటిలో రోజుకో అంశంపై తాను స్పందించనున్నట్లు చెప్పారు.

ఐదు అంశాలు… గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఎపికి ప్రత్యేక హోదా. అయితే గురువారం గోవధపై పవన్ స్పందించారు. గోవధ నిషేధంపై బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పార్టీ పాలిత రాష్ట్రాల్లో తక్షణమే గోవధపై నిషేధం విధించవచ్చు కదా అని ప్రశ్నించారు.

అంతేగాక ఆవులను రక్షించాలనుకుంటే ప్రతి బిజెపి కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. ఇక తరువాతి అంశమైన వేముల రోహిత్ ఆత్మహత్యపై శుక్రవారం స్పందించనున్నట్లు ట్విట్ చేశారు.

Related Posts

About The Author

Add Comment