‘అమ్మ‘కు బాగా ఇష్టమైనవేంటో తెలుసా..?

JAYAహైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థం బాదం, జీడిపప్పులతో తయారు చేసిన ఫలూద. ఈ పదార్ధం చాలా ఇష్టంగా తినేదని అలనాటి మలయాళ నటి, జయలలిత సినీ స్నేహితురాలు షీలా గుర్తు చేసుకున్నారు. జయలలిత, తాను సినీ పరిశ్రమలో రాణిస్తున్న రోజుల్లో, అయితే బయటికి వెళ్తే అభిమానులనుండి ఇబ్బంది ఎదుర్కొనేవారమనీ అన్నారు. దీంతో తాము రాత్రివేళల్లో ముఖానికి ముసుగు ధరించి సెకండ్ షో సినిమాలకు వెళ్లేవారమని, సినిమా ముగిసిన తరువాత రోడ్డు పక్కన ఉండే స్టాల్ లో జయ తనకు ఇష్టమైన ఫాలుదా తినేదని పాత సంగతులను ఈ సందర్భంగా నెమరవేసుకున్నారు షీలా. అలాగే జయ ఎక్కువగా నవలలు, పుస్తకాలు బాగా చదివేదనీ, అందుకు ఆమె లీవింగ్ రూంను లైబ్రరీగా మార్చుకుందని తెలిపారు.

         జయ ఓ కుక్క పిల్లను పెంచుకుందనీ, ఎంతో ఇష్టంగా చూసుకునేదనీ, దానికి జూలీ అనే పేరు పెట్టింది. 1998లో జూలీ చనిపోవడంతో జయ చాలా రోజులు బాధిపడిందని జయలలితకు అప్పట్లో పి ఆర్ ఓగా పనిచేసిన ఆనందన్ గుర్తు చేసుకున్నారు. జయ ముక్కు సూటిగా మాట్లాడేవారనీ, ఒకసారి కర్నాటకలో షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఓ గుంపు వచ్చి తమిళియన్ గా ప్రకటించుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా, ధైర్యంగా ‘ నేను తప్పుగా మాట్లాడలేదు.. నిజమే మాట్లాడాను.. నేను కన్నడీగను కాదు.. నేను తమిళియన్ను ’ అంటూ ఘాటుగా చెప్పిందట.

Related Posts

About The Author

Add Comment