మోడీని ఆడిపోసుకున్నారు…?

నల్లకుబేరుల భరతంపట్టేందుకు ప్రధాన మంత్రి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కొందరు ప్రశంసల జల్లులు కురిస్తుండగా మరోవైపు పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… మోడీ తీసున్న నిర్ణయంపై కొందరు విద్యావంతులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ప్రశంసిస్తుండగా, సామాన్యులు మాత్రం మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు పలు ఇక్కట్లు గురువుతున్నట్లు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, యూటూబ్‌ల ద్వారా తమ అభిప్రాయాలను, ఉక్రోషాన్ని వెల్లడిపరుస్తున్నారు. ఉత్తర భారతంలో పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దిష్టిబొమ్మకు చెప్పులతో కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోటితో కూడా ఉచ్ఛరించని విధంగా అసభ్య పదజాలంతో దూషించి మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.. అయితే వీటన్నింటినీ అధిగమించి ప్రధాని రాబోయే రోజుల్లో అసలైన నల్లకుబేరులను, బినామీలను పట్టుకుని నల్లధనాన్ని ప్రభుత్వ ఖాతాలోకి తీసుకురాగలిగితే.. ఇప్పుడు ఏ నోటితో దూషిస్తున్నారో అవే నోళ్లు మూతపడతాయని, ఆ నోళ్లతోనే మోడీని ప్రశంసించాలని పలువురు బిజెపి కార్యకర్తలు, అభిమానులు పేర్కొంటున్నారు.

 

Related Posts

About The Author

Add Comment