ఈ ‘కారు’కూతలు వింటే షాకవుతారు..!!

మాట్లాడే చిలుకను చూశాం.. సాకేతికత అభివృద్ధిచెందడంతో మాట్లాడే రోబోలూ అందుబాబులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు మాట్లాడే కారు కూడా అందుబాబులోకి వచ్చింది.
సరదాగా ఏదైనా లాంగ్ ట్రిప్ వేళ్లాలనుకున్నప్పుడు కార్ లో ఒంటరిగా ప్రయాణం చేయడం ఎంతో బోర్ కొడుతోంది. అందుకు స్నేహితులెవర్నైనా తోడుగా తీసుకెళ్తుంటాం.. ఏం చక్కా కబుర్లు చెప్పుకుంటా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అయితే ఇప్పుడు కారులో ఒంటరిగా ప్రయాణం చేసే వ్యక్తులకు, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, వారి ఫీలింగ్స్ కు తగ్గట్టుగా కబుర్లు చెప్పే కారు రూపుదిద్దుకుంది.
డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి మానసిక భావోద్వేగాన్ని అర్థం చేసుకుని వారికి తగ్గట్టుగా కబుర్లు చెబుతుందట. జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హోండా ఈ మాట్లాడే కారును తయారు చేసింది. జపాన్ లోని టెలికాం దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్, హోండా కలిసి సంయుక్తంగా కృత్రిమ ఇంటలిజెన్స్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీనికి ‘ఎమోషన్ ఇంజిన్’. ఇది డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముఖంలోని భావాలను గమనిస్తూ వారితో ముచ్చటిస్తుంది.. అలాగే సెన్సర్ల ద్వారా గ్రహించే విషయాలను డ్రైవర్ కు తెలియజేస్తుందని హోండా సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కారును అమెరికాలోని లాస్ వెగాస్ లో జరగనున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్)లో ఈ కారును ఆవిష్కరించనున్నారు.

Related Posts

About The Author

Add Comment